మగువలకు అందం బంగారు ఆభరణాలు. ఈ బంగారానికి అందుకే చాలా డిమాండ్. అయితే గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.49,420కి చేరింది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.45,300కు పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా రూ.500 పెరగడంతో కిలో వెండి ధర రూ.65,100కు పెరిగింది.