ఇండియా లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దానికి ఉన్న డిమాండ్ మరేదేనికి ఉండదు. గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు…గడిచిన 24 గంటల్లో పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరలు చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగింది. దీనితో రూ. 43,350 కి చేరింది.
ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ. 47, 290కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ. 64,400 వద్ద ఉంది.