ఈ ఏడాదికి గాను చివరి సంపూర్ణ సూర్య గ్రహణం సోమవారం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:03 గంటల నుంచి 11:24 గంటల వరకు గ్రహణం ఏర్పడనుంది. అయితే మన దగ్గర రాత్రి పూట కావడంతో గ్రహణాన్ని వీక్షించే అవకాశం మనకు లేదు. కానీ ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో ఈ గ్రహణాన్ని ప్రజలు వీక్షించవచ్చు.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చిలీలోని శాంటియాగో, బ్రెజిల్‌లోని సావో పాలో, అర్జెంటీనాలోని బ్యూనోస్ ఎయిరెస్, పెరూలోని లీమా, ఉరుగ్వేలోని మాంటెవిడియో, పరాగ్వేలోని అసున్‌షియాన్ తదితర ప్రాంతాల్లో వీక్షించవచ్చు. కొన్ని చోట్ల ఈ గ్రహణం పాక్షికంగా కూడా కనిపిస్తుంది. ఇక భారత్ లాంటి దేశాల వాసులకు గ్రహణం కనిపించదు కనుక వారు నాసాకు చెందిన లైవ్ స్ట్రీమింగ్‌లో గ్రహణాన్ని వీక్షించవచ్చు.
కాగా ప్రతి ఏటా సూర్య గ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. అందులో భాగంగానే వచ్చే ఏడాది.. అంటే.. 2021 జూన్ 10వ తేదీన వార్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. అది యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, నార్త్, వెస్ట్ ఆఫ్రికా, నార్త్ అమెరికాలోని పలు ప్రాంతాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది. ఇక వచ్చే ఏడాది.. 2021 మే 26వ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ గ్రహణం సౌత్, ఈస్ట్ ఆసియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లోని వాసులకు కనిపిస్తుంది.
Advertisements