దేశీయ స్టాక్ మార్కెట్లపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా పడుతోంది. దీంతో మార్కెట్ సూచీలు మందుపర్లు షాక్ ఇస్తున్నాయి. సోమవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య కొనసాగుతూ చివరకు లాభాలతో ముగిశాయి. ఈ రోజు సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి.. 57,420 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధి చెంది.. 17,086 వద్ద స్థిరపడింది. ఈ రోజు సెన్సెక్స్ 575 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. తరువాత మళ్లీ నెమ్మదిగా పుంజుకుంది. నిఫ్టీ 16,833 వద్ద అత్యల్పస్థాయికి చేరి.. మళ్లీ లాభాలబాట పట్టింది.
టెక్‌మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, కొటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలు గడించగా.. ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, మారుతి, రిలయన్స్, భారతీఎయిర్‌టెల్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.