టి కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే హైదరాబాద్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు ఆయన పార్టీ ప్రక్షాళన కోసం పలు సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తో భేటీ కానున్నారు. తర్వాత డీసీసీ,పీసీసీ ఆఫీస్ బేరర్స్ తో థాక్రే సమావేశం కానున్నారు.
ఇక నిన్న అర్థరాత్రి 12 గంటల వరకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగింది. నాలుగున్నర గంటల పాటు సాగిన పీఏసీ సమావేశంలో నేతలకు సుతిమెత్తగా థాక్రే హెచ్చరించారు. నేతలంతా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. దేశం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే మీరు గొడవలకు దిగడం మంచిదేనా అంటూ ఆయన కామెంట్స్ చేశారు. వివాదాలను పక్కన పెట్టి కలిసిమెలిసి పని చేయాలని నేతలకు సూచించారు థాక్రే.
పీఏసీలో హాత్ సే హాత్ జోడోయాత్ర పై సుదీర్ఘంగా నేతలు చర్చించారు. పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు ప్రతీ ఒక్కరూ ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం రెండు నెలల పాటు పాదయాత్ర చేయాలని థాక్రే చెప్పారు.అయితే రెండు రోజుల పర్యటన నిమిత్తం మొదసారి రాష్ట్రానికి వచ్చిన థాక్రే గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామని నేతలకు థాక్రే సూచించారు. ప్రతి పబ్లిక్ ఇష్యూను వదలకుండా పోరాటం చేయాలని నేతలకు ఆయన చెప్పారు.
అయితే సర్కార్ వ్యతిరేకతను పార్టీకి కలిసొచ్చేలా వ్యూహ రచన చేయాలని నేతలకు థాక్రే సూచించడంతో పాటు ఈగోలతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని చెప్పారు. మనమంతా కుటుంబ సభ్యులమేనని నేతలకు వివరించిన ఆయన ప్రతి నెల పార్టీలో డెవల్ మెంట్ కనిపించాలని సీరియస్ గా చెప్పారు. అయితే పార్టీని ఏకతాటి పైకి తీసుకొని రావడంతో పాటు సీనియర్,జూనియర్ల మధ్య నెలకొన్న భారీ గ్యాప్ ను తొలగించడం అదే విధంగా కోమటి రెడ్డి లాంటి సీనియర్ల ను తిరిగి పార్టీలో యాక్టివ్ చేయడం లాంటి చాలా సవాళ్లే కొత్త చీఫ్ మాణిక్ రావ్ థాక్రే ముందున్నాయి.