కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో విచారణ సమయంలో తాను 10 నుంచి 12 గంటల పాటు కుర్చీలోనే కూర్చోని వున్నట్టు ఆయన తెలిపారు. దీంతో తనను చూసి దర్యాప్తు అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారని ఆయన తెలిపారు.
కుర్చీలో నుంచి కనీసం ఒక్క సారి కూడా లేవకుండా తాను అన్ని గంటలు ఎలా కూర్చుని ఉన్నానని, దాని వెనక సీక్రెట్ ను తెలుసుకోవాలని అధికారులు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.
తాను విపాసనను చేస్తానని అధికారులతో చెప్పినట్టు తెలిపారు. దీంతో విపాసన అంటే ఏమిటని ఆ అధికారులు అడిగారని ఆయన చెప్పారు. కానీ అసలు విషయం అది కాదనీ దానికి మరో కారణం ఉందని ఆయన వివరించారు.
దర్యాప్తు సమయంలో ఆ గదిలో తానొక్కడినే లేనని, ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత తన వెంటే ఉన్నారని ఆయన అన్నారు. ఒక నాయకుడు అలసిపోగలడు కానీ, వేలాది మంది పార్టీ కార్యకర్తలు అలసిపోలేరని చెప్పారు.