బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ భారతీయ జనతా పార్టీలో చేరతారా? అవుననే అంటున్నాయి మహారాష్ట్ర రాజకీయ వర్గాలు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మున్నాభాయ్ కలవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది.
నాగపూర్: మున్నాభాయ్ కాషాయదళంలో చేరబోతున్నారనే ప్రచారం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. సంజయ్ దత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవ్వడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. కేవలం తాను మర్యాదపూర్వకంగానే కలిశానని సంజయ్‌దత్ పైకి చెబుతున్నా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

సంజయ్‌దత్ తండ్రి సునీల్ దత్, సోదరి ప్రియాదత్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎంపీలుగా గెలుపొందారు. ఇప్పుడు సంజయ్‌దత్ అకస్మాత్తుగా గడ్కరీని కలవడంతో ఆయన బీజేపీలో చేరతారని ముంబైలో ప్రచారం జోరందుకుంది.