ఛూ..మంతర్
ఇన్నాళ్లూ మాయ..ఇప్పుడు మాయం!
– తొలివెలుగు ఎఫెక్ట్ తో..
– బోర్డు పీకేసి మరీ ఫినిక్స్ దందా
– తేలుకుట్టిన దొంగలా ఫినిక్స్
– 5వేల కోట్ల స్కాంకు పాతర
– బోర్డులు మాయం చేస్తే..కబ్జా ఆగుతుందా!
– సర్కారీ భూమి ప్రైవేట్ పరం..
– ఐనా చర్యలు తీసుకోరా !
– దోచుకున్నోడికి దోచుకున్నంత!
– అందుకేనా..నేతల నోటికి తాళం!
– తొలివెలుగు దగ్గర పక్కా సాక్ష్యాలు
– రండి..5 వేల కోట్ల స్కాంను అడ్డుకుందాం
– ఐకియా పక్కన ప్రభుత్వ స్థలాన్నికాపాడుదాం
తొలివెలుగు క్రైంబ్యూరో, హైదరాబాద్ : ఫినిక్స్ భూ ఫిక్సింగ్ అంటూ తొలివెలుగు వెలుగులోకి తెచ్చిన భారీ భూ కుంభకోణాన్నితొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.స్కాంకు ఎవరెవరు సహకరించారు.1996 నుంచి ఏం జరిగింది..! ఎలా జరిగింది !ఎవరు తప్పిదాలు చేశారని ఫోటోలతో సహా సామాన్యులకు అర్ధమయ్యేలా పూసకుచ్చినట్లు వరస కథనాలతో ఫినిక్స్ బండారాన్నితొలివెలుగు బయటపెట్టింది. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం..సీలింగ్ లో మిగులు భూమిని ప్రభుత్వ భూమి అని ఫైట్ చేయాల్సింది పోయి..అప్పనంగా ఫినిక్స్ కి 42ఎకరాలు కట్టబెట్టారు.ఈ యవ్వారాల గుట్టు అంతా రట్టుకావడంతో ఫినిక్స్ ఈక్యోనోక్స్ పేరుతో వెలిసిన బోర్డులు పీకేసింది.తొలివెలుగు కథనాలకు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తూ..బోర్డులను మాత్రమే పీకేసి.. పనులు మాత్రం సైలెంట్ గా కొనసాగిస్తోంది.అసలు ఇక్కడ భూ కుంభకోణమే జరగలేదనే కలరింగ్ ఇస్తోంది.
Also Read: కాంగ్రెస్ డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమం.. ర్యాలీ నిర్వహించిన రేవంత్
ఇక మా కథనాల్లో.. గులాబీ సర్కార్ లో ఉన్నపెద్దలు వారి లబ్దికోసమే ఫినిక్స్ కు క్లియరెన్స్ ఇచ్చారని స్పష్టం చేశాం. ఫినిక్స్ ఒక్క గచ్చిబౌలిలోనే కాదు..నిర్మాణం చేపట్టిన ప్రతి చోటా ఎదో ఒక లిటిగేషన్ ఉంటుంది.హఫిజ్ పేటలో పక్కనే ఉన్న 17 గుంటల భూమి కబ్జా చేశారు.ప్రభుత్వం మావైపు ఉందని బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.నార్సింగ్ అవతార్ చౌరస్తాలో 8ఎకరాల చెరువును కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.వివాదం ఉన్నభూమిని సెటిల్మెంట్ చేసుకున్న సమయంలో డి.ఎల్.ఎఫ్. చెరువు ఎఫ్.టి.ఎల్. భూమిని కొత్తకాపు ముత్యంరెడ్డికి ఇచ్చేశారు.అదంతా హెచ్.ఎం.డి.ఏ.లో వాటర్ జోన్ గానే ఉంది.కాని ఇప్పుడు ఫినిక్స్ మట్టితో పూర్తిగా నింపేసింది. మామిడిపల్లిలో వివాదంలో ఉన్న భూమిని కొనుగోలు చేసి కోర్టులో కేసులు ఉండగానే రేరా అనుమతులతో అమ్మేసుకుంటుంది.ఇలా చెప్తూ పోతే ఫినిక్స్ మోసాలు చాంతాడంత.2013లో ప్రభుత్వ భూమికి క్లియరెన్స్ కోసం అప్లయి చేసుకుంటే..2019 డిసెంబర్ లో అప్పగించారు.ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన వారు..బంగారు తెలంగాణలోఆంధ్రా బిల్డర్ల చేతికి 5వేల కోట్ల భూమిని గులాబీ పువ్వుల్లో పెట్టి మరీ అప్పగించారు. మరోవైపు..బినామీలు ఫినిక్స్ కి చెందిన 14 కంపెనీల్లో ఎలా డైరెక్టర్స్ అయ్యారో తొలివెలుగు సాక్ష్యాలతో సహా సవివరంగా కళ్లకు కట్టింది.
ఇదే అదను..పోరాడితేనే భూమి దక్కేది!
లిటిగేషన్ భూముల్లో ప్రభుత్వ పెద్దలకు మాముళ్లు ఇచ్చి.. బోర్డులు తీసివేసి..నయవంచనతో పనులు జరిపిస్తున్న ఫినిక్స్ కి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది.ఈ వ్యవహారం పై దర్యాప్తు చేస్తునే..నిర్మాణాలు ఆపించాల్సిన అవసరం ఉంది. ఒక అనామక సంస్థగా హైదరాబాద్ లో ఎంటరై..5 వేల కోట్ల భూ స్కాంకి పాల్పడినా, ఏ రాజకీయ పక్షం నోరుమెదపడం లేదు. ఎందుకంటే ఫినిక్స్ అందరిని ఫిక్సింగ్ లో పాలుపంచుకునేలా చేస్తుంది కాబట్టి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ..నార్సింగ్ చెరువును కబ్జా చేసి మరో వెయ్యి కోట్ల భూ స్కాంకి తెరలేపుతోంది. హెచ్.ఎం.డీ.ఏ. 2031 మాస్టర్ ప్లాన్ లో వాటర్ బాడీ అని ఎలాంటి నిర్మాణాలకు తావులేకుండా ప్లానింగ్ ఉంటే.. కమర్షియల్ బిల్డింగ్ అంటూ.. టీ.ఎస్.ఐ.ఐ.సి నుంచి అనుమతులు తెచ్చుకొని బరితెగిస్తోంది. ఆంధ్రా రియల్ ఎస్టెట్ కంపెనీలు తెలంగాణ భూములను చెరపడుతున్న తీరు ఇంకా ఎన్నాళ్లు చూస్తూ ఊరుకుంటాం..ఏలినవారికి పట్టదు..ఫినిక్స్ వలలో పడ్డ నేతలకు,అధికారులకు అసలే పట్టదు..ఇక ప్రజాధనాన్ని..మన భూమిని కాపాడుకోవాల్సింది ఎవరు..మనమే..రండి ప్రశ్నిద్దాం.