– ఎడాపెడా కంపెనీలు..విచ్చలవిడిగా హామీలు
– కోట్లలో వసూళ్లు..ఏడేళ్లలో సీన్ రివర్స్
– ఫినిక్స్ పేరు చెప్పుకోడానికే భయపడుతున్నారా?
– ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయా?
– తొలివెలుగు దెబ్బకు ఫినిక్స్ విలవిల!
క్రైం బ్యూరో, తొలివెలుగు:తొలివెలుగు దెబ్బకు ఫినిక్స్ పునాదులు కదులుతున్నాయి.కబ్జాలు,అక్రమాలు..ఇలా జరుగుతున్నక్రైమ్ కహానీని ఆధారాలతో సహా బయటపెడుతుండడంతో ఏం చేయాలో పాలుపోక..ఏకంగా బిచానా ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అక్రమంగా నిర్మిస్తున్నసంస్థల బోర్డులు తిప్పేస్తోంది.ఆరు నెలల ముందు అన్నిప్రాజెక్ట్ ల దగ్గర బోర్డులు పుష్కలంగా కనిపించేవి.అందమైన కొటేషన్స్ తో పెద్ద పెద్దవి ఉండేవి.కానీ..ఇప్పుడవి కనిపించడం లేదు.తొలివెలుగు పూర్తి ఆధారాలతో వార్తలు ప్రచురించడంతో ఫినిక్స్ కు అధికారుల నుంచి పొత్తు పెట్టుకున్న పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రెషర్ పెరిగిపోయింది.ఏ ప్రాజెక్ట్, ఎవరు కడుతున్నారో తెలియకపోతే ఏం రాస్తారులే అనుకుని ఆరు నెలల నుంచి తమ పేర్లు లేకుండానే దొంగ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. 2008లో పద్మాలయ భూముల నుంచే రుచి మరిగిన ఫినిక్స్ కంపెనీ.. ఆ తర్వాత చాలా తతంగాలు చేసింది.
చుక్కపల్లి తప్పుకుని గోపికృష్ణ రావడంతో మెగా డీల్స్!
2017 నవంబర్ లో చుక్కపల్లి సురేష్ కొరియా దేశానికి తెలంగాణలో గౌరవ కాన్సుల్ జనరల్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఛైర్మన్ పదవి వదిలి సామ్రాజ్యాన్ని అంతా మేనేజింగ్ డైరెక్టర్ గోపికృష్ణకు అప్పగించారు. అతను వచ్చిన తర్వాత బినామీ డైరెక్టర్లు పెరిగిపోయారు. అప్పటికే చిన్నచిన్నలిటిగేషన్ భూములను డీల్ చేసిన వారు..2017 తర్వాత పెద్ద ఎత్తున ప్రైం లోకేషన్ లో ప్రభుత్వం వద్ద ఫైల్స్ పెండింగ్ ఉన్నభూములను పట్టుకున్నారు. ప్రత్యేక జీవోలు తీసుకోస్తే తప్ప..నిర్మాణం చేపట్టలేని భూముల లిటిగేషన్ ఫైల్స్ ని ప్రభుత్వం ముందు ఉంచారు. ఇంకేముంది. అందుకు కావాల్సిన ప్రతిఫలాలు ప్రభుత్వ పెద్దలకు అందడంతో మూడు ప్రాంతాలు కాస్తా..15కు విస్తరించాయి.
అప్పులు అయ్యాయా? కావాలని తప్పించుకుంటున్నారా?
వేల కోట్ల ప్రాజెక్టులు కావడంతో లిటిగేషన్ లో తక్కువ ధరకు వస్తుందని ఈ నాలుగేళ్లలో 12 ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. బ్యాంకు లోన్స్ తీసుకుని మళ్లీ క్లియర్ చేయకపోవడం.. సరైన అకౌంట్స్, ఆడిటింగ్ మెయింటెన్స్ చేయకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు అంతా సాఫీగా జరుగుతుందని అనుకునే సమయంలోనే నిర్మించిన ప్రాజెక్టులకు కరోనా దెబ్బ తగిలింది. ప్రతీ ప్రాజెక్టు కమర్షియల్ స్పేస్ అయినందున లీజు, అమ్మకం అంతా ఈజీగా, త్వరగా అయ్యే పనిలా లేదు. దీనికితోడు ఎడాపెడా హామీలు ఇవ్వడంతో రాజకీయ నాయకులు తమ సంగతేంటని ఒత్తిడి చేయడంతో ఫినిక్స్ కంపెనీకి ఆర్థిక కష్టాలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. అందుకే గోపికృష్ణ ఉండే ఇంటిని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2కి మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.మరోపక్క స్మశాన వాటికల్లో ఆదాయం పొందుతుండటం వినాశానానికి దారితీస్తుందని పండితులు గుర్తుచేసినా పెడచెవిన పెట్టడంతో ఏడేళ్ల ఎఫెక్ట్ ఇప్పుడు పడుతోందని చర్చించుకుంటున్నారు.
ఫినిక్స్ పక్కకు పాయే..శ్రీనిధి ఎస్టేట్ వచ్చే..?
ఫినిక్స్ పేరుతో సుమారు 60 కంపెనీలు ఏర్పాటు చేశారు.వాటిలో కొత్తగా డైరెక్టర్స్ ని చేర్పించుకొని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అయితే.. ఇప్పుడు రూట్ మార్చారు.ఫినిక్స్ పేరు లేకుండానే అదే డైరెక్టర్స్ మారు పేరుతో కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.శ్రీనిధి ఎస్టేట్ కంపెనీకి ఎండీగా ఉన్న కొల్ల ఉమాంజ వెంకట సత్య శివ శ్రీహరి పేరు పైకి ఫినిక్స్ కంపెనీని తరలిస్తున్నారు. బ్రాండ్ నేమ్ ఫినిక్స్ అయినా..తొలివెలుగు క్రైం బ్యూరో ఇన్వెస్టిగేషన్ లో బాగోతం బట్టబయలు కావడంతో బోర్డులనే కాకుండా.. ఆ పేరుతో డైరెక్టర్స్ గా జాయిన్ కావాలన్న కొత్త వారు వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో తాజా ఎవర్ మార్క్ సెజ్ డెవలపర్స్ పేరుతో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు.అయితే డైరెక్టర్స్ లో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. బోగి శ్రీధర్ రావు,శ్రీకాంత్ బడిగే కలిసి కొత్త వెంచర్స్ ప్రారంభిస్తున్నారు.