ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ జరుగనుంది. ఈ సందర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా విడుదల చేసిన ఆలయ నమూనా చిత్రాలు .. భవిష్యత్‌లో రామ మందిరాన్ని కళ్లముందుంచుతున్నాయి.
మూడంతస్తుల్లో రామ మందిర నిర్మాణం జరగనుంది. దిగువ అంతస్తులో రామ్‌లల్లా విగ్రహం, నృత్య మండపం, సింహద్వార్, పూజామండపం, రంగ్ మండపం, గర్భగృహం ఉంటాయి. 27 నక్షత్ర వాటికలను ఏర్పాటు చేయనున్నారు.
మందిరం సముదాయంలో ప్రార్థనా మందిరం, వేద పాఠశాల, ఉపన్యాస వేదిక,యాత్రి నివాస్, సంత్ నివాస్‌ను నిర్మిస్తారు. మందిరం నిర్మాణ పనులను L & T సంస్థ చేపడుతోంది. మూడున్నరేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అంచనా.