- మోటార్ల భారం ప్రభుత్వానిదేనా?
- సీఎం కళ్లుగప్పి బ్యాక్ డేటెడ్ జీవో!
- కేసీఆర్ కే టోపీ పెడుతున్న కృష్ణారెడ్డి ఏజెంట్స్!
- స్విట్జర్ ల్యాండ్ లో మేఘా పార్టీ
- సారుకు రజత్ కుమార్, హరిరామ్ వెన్నుపోటు?
- కాళేశ్వరం కథలు- పార్ట్ 5
క్రైంబ్యూరో, తొలివెలుగు:కాళేశ్వరం పంప్ హౌస్ మునకతో ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఇంకా డబ్బులు తగలేయడం అవసరమా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం నష్టమంతా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఓ ప్రకటన చేశారు. కానీ.. సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఏకంగా కేసీఆర్ కే కుచ్చుటోపీ పెట్టే ప్లాన్ కు మేఘా పథక రచన చేసింది. నష్టం వందల కోట్ల వరకు అవుతుందనే వాదన ఉంది. కానీ.. ప్రభుత్వ వర్గాలు అంత అవదని ప్రకటించాయి. ఎంతైనా ఖర్చు అనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్. కాంట్రాక్ట్ సంస్థ డబ్బులు కడితే పర్లేదు. ప్రభుత్వం చెల్లించాల్సి వస్తే.. అది ప్రజల సొమ్ము. ఇప్పటికే తప్పుడు నిర్ణయాలతో వేల కోట్లు నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మోటార్ల మునక భారం కూడా ప్రజలపై మోపే పరిస్థితి కనిపిస్తోంది.
సీఎంకే మస్కా.. బ్యాక్ డేటెడ్ జీవో!
ప్రభుత్వంలో మేగా ఏజెంట్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యమే. వారి ఇళ్లల్లో పెళ్లి వేడుకలు, బర్త్ డే పార్టీలకు ఖర్చు పెట్టడమే ఇందుకు నిదర్శనం. ఆమధ్య రజత్ కుమార్ కుమార్తె పెళ్లి పార్టీపై ఎంతటి రచ్చ అయిందో తెలిసిందే. మేఘా సంస్థ ప్రభుత్వ అధికారులను మచ్చిక చేసుకుని కేసీఆర్ కు మస్కా కొడుతోందని దీన్నిబట్టే అర్థం అవుతోందనే వాదన బలంగా వినిపించింది. తాజాగా మరోసారి కేసీఆర్ కళ్లుగప్పి బ్యాక్ డేటెడ్ జీవో జారీ అయినట్లు తెలుస్తోంది.
స్విట్జర్ ల్యాండ్ పార్టీ రహస్యాలేంటి?
ఈనెల 3 నుంచి 14 వరకు ఇరిగేషన్ శాఖలోని కీలక అధికారులు స్విట్జర్ ల్యాండ్ టూర్ కు వెళ్లారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులకు సంబంధించి అధికారికంగానే ఈ టూర్ నడిచింది. కానీ.. తెరవెనుక మేఘా విహారయాత్రలా ఇది సాగిందని సమాచారం. రజత్ కుమార్ ఫ్యామిలీతో సహా స్విస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చారు. ఈ టూర్ జీవోలో జారీ చేసినవారిలో ఒక్క మురళీధర్ రావు తప్ప అందరూ వెళ్లొచ్చారు. ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ పెంటారెడ్డి, జెన్ కో చీఫ్ ఇంజనీర్ బాలరాజు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్, కాళేశ్వరం ప్యాకేజ్ 4లో కీలక వ్యక్తి హరిరామ్, బసవరాజ్, అబ్దుల్, శ్రీనివాస్ ఉన్నారు.
స్విస్ టూర్ ఎఫెక్ట్.. మరో భారీ స్కాం!
మేఘా పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేసొచ్చారు అధికారులు. తర్వాత వరదలు ముంచెత్తి కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగిపోయాయి. నష్టాన్ని కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని చెప్పినా.. మేఘా కృష్ణారెడ్డి ఇక్కడే చక్రం తిప్పారని తెలుస్తోంది. పార్టీల పేరుతో అధికారులను ఏజెంట్స్ గా మార్చుకుని కేసీఆర్ కే టోపీ పెట్టే స్కెచ్ గీశారని సమాచారం. పంపుల మునక భారాన్ని ప్రభుత్వంపై మోపారని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు రజత్ కుమార్, హరిరామ్ వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తోందని అర్థం అవుతోంది.