– ప్రాజెక్టుల మాటున పారుతున్న అవినీతి
– నమ్మి ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పట్టం కడితే..
– ఎనిమిదేళ్లలో వెనకేసుకున్నదెంత..?
– పాత కంపెనీల పేర్లతో కొత్త బినామీ డైరెక్టర్స్
– వారికే కాంట్రాక్ట్స్ దక్కేలా ప్లాన్స్
– కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకున్న చీటి మురళీధర్ రావు!
– కుమారుడు అభిషేక్ రావుకి సబ్ కాంట్రాక్టులు
– సీఎం సార్ కి ఇవన్నీ తెలుసా..?
– ఈఎన్సీ.. ఇంట్లో ఇరిగేషన్ డబ్బులపై ఎంక్వైరీ స్టార్ట్
– తొలివెలుగు క్రైంబ్యూరో ఎక్స్ క్లూజివ్ కథనాలు
క్రైంబ్యూరో, తొలివెలుగు:గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో రెండున్నర లక్షల కోట్ల తాగు, సాగు నీరు ప్రాజెక్టుల పనులు జరిగాయి. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ దాహం తీర్చేందుకు కేసీఆర్ ప్రాజెక్ట్ రీ డిజైన్స్ అన్నారు. రిటైర్డ్ అయిన ఎంతోమంది ఇంజనీర్ల సహాయ సహకారాలు తీసుకున్నారు. అందులో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా రిటైర్డ్ ఆఫీసర్ కి 8 ఏండ్లుగా ఎక్స్ టెన్షన్ ఇస్తూ వచ్చారు. ప్రాజెక్టుల పనులను ఎంతో చాకచక్యంగా నడిపించే గుండెకాయ లాంటిది ఆ పోస్ట్. అయితే.. పనుల్లో మాత్రం నాణ్యత లేదని అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఇంజనీర్ల పనితనం, కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగోతంపై గతంలో తొలివెలుగు క్రైంబ్యూరో వరుస కథనాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులను ఏటీఎంలా మార్చుకున్నారని బీజేపీ అగ్ర నేతలు విమర్శించారు. ఏటీఎంలా వాడుకున్న డబ్బులు ఎటు వెళ్లాయో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీయడం మొదలైంది. ఎవరెవరికి ఎలా కేటాయింపులు చేశారు.. వర్క్ ఆర్డర్స్ ఎలా వచ్చాయి.. పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? అంచనా ఎంత..? ఖర్చు పెట్టింది ఎంత..? అధికారులు చేసిన సహాయానికి బ్యాక్ డోర్ ఎలా తెరుచుకుంది..? ఇలా అన్నింటిపై సమగ్ర నిఘా పెట్టినట్టు సమాచారం.
అందరూ కలిసి ఎన్ని వందల కోట్లు దాచుకున్నారో త్వరలో గుట్టు రట్టు కాబోతోంది. ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు అవినీతి బాగోతంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టినట్టు తెలుస్తోంది. కుమారుడి ద్వారా కంపెనీలను ఎవరెవరికి ఫ్లోటింగ్ చేశారని ఆధారాలు రాబట్టుతున్నారట. బినామీలు ఎవరెవరో ఆరా తీస్తున్నారని సమాచారం.
మురళీధర్ రావు నీళ్ల మూటలు ఇలా మొదలయ్యాయా?
మేఘాతో సబ్ కాంట్రాక్ట్ డీల్స్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ తీర్థం తీసుకున్న ఎమ్మెల్యేకు, ఆయన అల్లుడికి చేసిన సేవలు.. వరంగల్ లోని బిల్లా హర్షవర్దన్ రెడ్డికి ఈఎన్సీ ఇప్పించిన కాంట్రాక్టులు. తన కుమారుడైన సాయి అభిషేక్ రావుకి ఎవరెవరితో సంబంధాలు ఎలా మొదలయ్యాయి? కంపెనీలు రెండే.. పార్ట్ నర్ షిప్ ఫర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఈఎన్సీ చీటి మురళీధర్ రావు ఇంట్లో చీకటిగా డబ్బులు ఎలా ప్రవహిస్తున్నాయో.. తర్వాతి కథనంలో చూద్దాం.