క్రెడాయి ప్రాపర్టీ షో.. చీటింగ్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. పాపులర్ ప్లాట్‌ఫామ్ కదా అని వెళ్తే.. నీట్‌గా మోసం చేసే కేటుగాళ్లు అక్కడ తయారయ్యారు. లేని భూమిని కస్టమర్లతో కొనుగోలు చేయించడమే గాక, రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని చెప్పి లక్షలు దండుకునే ప్లాన్ వేసింది కంపెనీ. ప్రజ్వల్ సువర్ణ సంపద పేరుతో ఆ సంస్థ బరితెగించిన బాగోతం తాజాగా తొలివెలుగు స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది.
రూ. 60 లక్షలు చెల్లించి ఇప్పుడు ఎకరం కొనుగోలు చేయాలట. వారు 20 నెలల్లో కోటి రూపాయలు బ్యాక్ ఇస్తారట. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కస్టమర్ల దగ్గరే పెట్టుకోవచ్చని, MoU కూడా చేసుకుంటామని చెబుతోంది. 20 నెలల తర్వాత ఎకరం భూమి వాపస్ ఇస్తే… తాము డెవలప్ చేసిన భూమిలో 1400 గజాలను రిజిస్ట్రేషన్ చేస్తామని పొంతన లేకుండా మాట్లాడుతోంది. 300 ఎకరరాల్లో వెంచర్ వేస్తున్నామని.. కానీ డీటీసీఏ పర్మిషన్ లేదని అది రావడానికి రెండేళ్లు పడుతుందని నమ్మబలుకుతోంది.
వారు చెప్పిన నిజంగానే అలా భూములు కొనుగోలు చేస్తే.. వారికి రూ. 200 కోట్లు వసూలైతే … 20 నెలల్లో కస్టమర్లకు ఇచ్చేందుకు తమ జేబులో నుంచి అదనంగా మరో నూట నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఏమాత్రం తడబాటు లేకుండా ప్రజ్వల్ సువర్ణ సంపద ఈ తతంగం నడిపిస్తోంది. పేరు ప్రతిష్ఠలు కలిగిన క్రెడాయి ప్రాపర్టీ షోలో కూడా ఇలాంటి మోసాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తొలివెలుగు స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇదే