తొలివెలుగు మరో కుటుంబంలో వెలుగు నింపింది. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరిలో నిలువ నీడలేక మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకుని, నిరుపేద కుటుంబం పడుతున్న కష్టాలపై తొలివెలుగు రాసిన కథనానికి తక్షణ స్పందన వచ్చింది. “దళిత బంధు సరే.. ఈ దరిద్రమేంటి?” శీర్షికన ఈ నెల 16 నుంచి ఆ కుటుంబం పడుతున్న కష్టం గురించి తొలి వెలుగు కథనాలు ప్రచురించింది/ ప్రసారం చేసింది. ఆయా కథనాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగడం, ప్రభుత్వం తీరుపై విమర్శలు రావడంతో అధికారులు ఆగమేఘాల మీద స్పందించారు.
బాధితురాలు సుజాత కుటుంబానికి వెంటనే ఇల్లును మంజూరు చేశారు. నిర్మాణానికి కావల్సిన సామాగ్రిని కూడా సరఫరా చేశారు. అటు ఆమె ఇద్దరు పిల్లల సంరక్షణను ఐ.సి.డి.ఎస్. అదికారులకు అప్పగించారు దీంతో ఆమె కష్టం తీరినట్టయింది. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఇల్లు మంజూరయ్యేందుకు సాయం చేసిన తొలివెలుగుకు సూజాత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం ఇంటినైతే మంజూరు చేసింది గానీ.. పూర్తయ్యే వరకూ మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటానని ఆమె చెబుతోంది.
Advertisements