సంవత్సరం గ్యాప్ తరువాత హీరో నితిన్ భారీ అంచనాలతో వచ్చిన చిత్రం భీష్మ. రష్మీక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మారుతి స్వర సాగర్ సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.
ముఖ్యంగా స్క్రీన్ పై నితిన్-రష్మీక జంట అద్భుతంగా ఉంటుంది. నితిన్ కామెడీ టైమింగ్ కు… వెంకీ కుడుముల తోడవటంతో… పాత కథనే అయినా కొత్తగా చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు, తర్వాత ఉండే కామెడీ సీన్స్ సినిమాకు హెలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ కామెడీ సీన్స్ గంట పాటు ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమాలో మిగతా నటి నటులు కూడా మెప్పించగా ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగుంటాయి. సంగీతం కూడా పర్వలేదనిపిస్తుంది. కష్టాల్లో ఉన్న కంపెనీని గట్టెక్కించే ప్రయత్నం లో నితిన్ బాధ్యతలు చేపట్టే కథాంశంతో సినిమా ఉంటుంది.
వాట్ ఏ బ్యూటీ, సూపర్ క్యూట్ పాటలు స్క్రీన్ మీద బాగుంటాయి. కానీ సింగలే సాంగ్ ఓకే అనిపిస్తుంది. సినిమా మొత్తం కామెడీ మీద ఆధారపడి ఉంటుంది… అయితే వెంకీ కుడుముల కథను హ్యాండిల్ చేసిన తీరు సినిమాకు ప్రేక్షకులను తీసుకెళ్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
Advertisements
ఎండ్ లైన్: భీష్మ చూడదగ్గ సినిమా