సైదాబాద్ బాలిక ఘటనపై కొన్ని ఛానల్స్ వ్యవహరించిన తీరేంటో అందరికీ తెలుసు. ముఖ్యంగా నెంబర్ వన్ అని చెప్పుకుని, సర్కార్ డబ్బా వాయించే ఛానల్ తీరును ప్రజలు చూశారు. అందుకే తొలివెలుగు పక్షాన నిలిచారు. ఇటు.. తొలివెలుగు మాత్రం వారం నుంచీ బాధిత గిరిజన కుటుంబం ఆవేదనను కళ్లకు కట్టింది..న్యాయం కోసం తనవంతుగా కష్టపడింది.
ఘోరం జరిగిన సమయం నుంచి ప్రతీ నిమిషం అప్ డేట్ ఇస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. చిన్నారి కుటుంబానికి బాసటగా నిలిచింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ‘‘జర్నలిజం గెలిచింది – తొలివెలుగు నిలిచింది’’ పేరుతో ఓ పోల్ నిర్వహించగా.. 92 శాతం మంది ప్రజలు తొలివెలుగుకు జై కొట్టారు. కళ్లుండి చూడలేని ప్రధాన ఛానళ్లకు ఇదో చెంపదెబ్బ లాంటిది. ఇంతకన్నా ఏం కావాలి. తొలివెలుగు ప్రజలపక్షం అని చెప్పడానికి.