– మీడియాకు మార్గదర్శనంగా తొలివెలుగు
– మణికొండలో అనకొండ ఫినిక్సేనని ముందే చెప్పిన తొలివెలుగు
– తాజాగా డెక్కన్ క్రానికల్, ఆంధ్రజ్యోతిలో కథనాలు
– తొలివెలుగు చెప్పిందంటే పక్కా నిజాలే!
– ఫినిక్స్ పేరుతో రూ.20 వేల కోట్ల భూ స్కాం!
– ఒకే కంపెనీపై ఎందుకంటే.. ప్రేమంట?
– మూడు నెలల క్రితమే ఆధారాలతో కథనం.. అయినా చర్యలేవి?
క్రైం బ్యూరో, తొలివెలుగు: ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ముఖ్యంగా పేదలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి. కానీ.. టీఆర్ఎస్ పాలన అంతా రివర్స్ లో జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. బడాబాబులను ఇంకా బలంగా చేస్తూ.. కోట్లకు పడగలెత్తిస్తోందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వాటిలో నిజానిజాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించింది తొలివెలుగు. ప్రభుత్వ భూముల మాయంపై అనేక కథనాలను ఇచ్చింది. వాటిలో ఫినిక్స్ కబ్జాలు చాలా ప్రత్యేకం. వందల కోట్ల విలువైన భూముల్ని ఆ కంపెనీ ఎలా కబ్జా పెడుతుందో ఆధారాలతో సహా ఇచ్చింది తొలివెలుగు. ముఖ్యంగా మణికొండలో 30 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎలా రెక్కలొచ్చాయో ఫోటోలతో సహా ప్రచురించింది. ఈ ఏడాది జనవరి 23న ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది తొలివెలుగు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ఫినిక్స్ లో భాగస్వామి అయిన నార్నే అరవింద్ మంత్రి స్నేహితుడు కావడంతో అతనికి అన్నీ ఎలా క్లియర్ చేస్తున్నారో వివరిస్తూ కథనాన్ని ఇచ్చింది.
ఎవరూ అంచనా వేయనప్పుడే తొలివెలుగు సంచలన కథనం ఇచ్చింది. దాని వెనుక ఎవరెవరు ఉన్నారో పేర్లతో సహా వివరించింది. అదే విషయాన్ని తాజాగా ఈనెల 8న డెక్కన్ క్రానికల్, 10న ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా ప్రచురించాయి. అయితే.. నగరం నడిబొడ్డున 2 వేల కోట్ల స్కాంకు తీరతీసినా.. మెయిన్ స్ట్రీం మీడియా మాత్రం పడకేసింది. వేల కోట్ల స్కాంలు జరుగుతున్నా ఎక్కడా చిన్న వార్తగా కూడా చూపించడం లేదు. కానీ.. తొలివెలుగు మాత్రం పక్కా ఆధారాలతో అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తోంది. నగరంలో జరుగుతున్న స్కాముల చిట్టాను వారికి తెలియజేస్తోంది.
ఫినిక్స్ కి రూ.20 వేల కోట్లు దొచిపెట్టారు?
ఆంధ్రాకి చెందిన ఫినిక్స్ ఇండియా కంపెనీకి ప్రత్యేక జీవోలు ఇచ్చి క్లియర్ అయ్యే భూములను దొచిపెట్టారు. దానికి సంబంధించి 26 కథనాలను అందించింది తొలివెలుగు క్రైం బ్యూరో. కేటీఆర్ కి తెలియకుండా ఈ తతంగం జరగదని అనుమానాలు వ్యక్తం చేసింది. ఒక్క అధికార పార్టీయే కాదు.. అన్ని పార్టీలను మేనేజ్ చేసి విలువైన భూములను ఎలా కొట్టేస్తున్నారో వివరించింది తొలివెలుగు. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ భూములపై ఇప్పుడు కన్నుపడింది. 42 ఎకరాలు ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనుసన్నల్లో నిర్మాణాలకు తెరలేపుతున్నారు.
ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోరా?
సంచలన కథనాలకు కేంద్ర బిందువైన తొలివెలుగు.. మీడియాకు మార్గదర్శనంగా మారుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించని అక్రమాలను వెలుగులోకి తెస్తుండడంతో ప్రజలు తొలివెలుగును ఆదరిస్తున్నారు. అయితే.. ప్రభుత్వ భూముల మాయంపై ఆధారాలతో సహా మూడు నెలల క్రితమే కథనం ఇచ్చినా.. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయినా.. వడ్డించేవాడు మనవాడు అయితే.. అన్నీ సాఫీగా సాగిపోతాయని ఊరికే అన్నారా? అధికార పార్టీ అండదండలు లేకుండా ఇన్ని కబ్జాలు ఎలా సాగుతాయనేది ప్రస్తుత ప్రశ్న. నిజంగా సర్కార్ కు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే.. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. కానీ.. ఇంతవరకు అటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్నో ఆటంకాలు.. అయినా తొలివెలుగు ఆగదు.. బెదరదు.!
తెలంగాణ ప్రభుత్వంలో పాలన పడకేసింది. దొచుకున్నోళ్లకు దొచుకున్నంత అన్నట్లుగా సాగుతోంది. అందుకే భూకబ్జా వ్యవహారాల్లో పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిన ఎలాంటి సమాచారం ఉండటం లేదు. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వడం లేదు. కమిషన్ 50 వేలు ఫైన్ విధిస్తే చెల్లిస్తాం కానీ.. మీకు మాత్రం సమాచారం ఇవ్వమని చెప్తోంది. కానీ.. తొలివెలుగు క్రైం బ్యూరో పట్టు వదలని విక్రమార్కునిలా సమాచారాన్ని సాధిస్తుంది. ప్రజల సొమ్ము పక్కదారి పట్టకుండా కాపాడుతుంది.
జనవరి 23న ఆధారాలతో సహా తొలివెలుగు ప్రచురించిన కథనం ఇదే.. ఈ లింక్ క్లిక్ చేయండి..
https://tolivelugu.com/phoenix-land-scam-part-22/