గుంటూరు: దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల వారికి సీఎం జగన్ 10 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. సహాయ చర్యలను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. గోదావరిలోకి దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నందునే ప్రమాదం జరిగినట్టు అధికారులు సీఎంకు వివరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, వివరాలు వెంటవెంటనే తెలియ జేయాలని ఆదేశించారు. అన్ని బోటు సర్వీసులు రద్దు చేయాలని ఆదేశించారు.
దోషులెవరో తేల్చి శిక్షిస్తాం ..
లాంచీని అనుమితించిన వారిపై చర్యలు తీసుకుంటామని, కెపాసిటికీ మించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. అందరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నానని, ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హోం మంత్రి తెలిపారు.