నానీస్ గ్యాంగ్‌లీడర్ గ్రాడ్యువల్‌గా జనానికి ఎక్కేసిందా..? సినిమా యూనిట్ థాంక్స్ మీట్‌లో కాన్ఫిడెంటుగా చెబుతున్న మాటలు, మూవీ ఫస్ట్ డే రెస్పాన్స్ తరువాత నాని.. వెరైటీగా చేసిన పబ్లిసిటీ క్యాంపేన్, ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఈ మూవీ ప్రస్తుతానికి ఎడారిలో ఒయాసిస్ అని అనిపిస్తోంది. సాహో దెబ్బకు తెలుగు ప్రేక్షకుడు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. మంచి మూవీ కోసం ఎదురుచూస్తున్న సినిమా అభిమానులకు గ్యాంగ్‌లీడర్ కాస్తో కూస్తో నచ్చింది. విక్రమ్ సినిమాని ఓ రేంజ్‌లో అస్సలు తీయలేకపోయినప్పటికీ నాచురల్ స్టార్ నాని అండ్ డిఫరెంట్ బ్లష్ బ్యూటీ ప్రియా అరుళ్ మోహన్.. ఈ ఇద్దరూ కలిసి సినిమాని గట్టెక్కించేశారనిపిస్తోంది.
నానీస్ గ్యాంగ్‌లీడర్ ‘థాంక్స్ మీట్’లో నాని తన లేటెస్ట్ మూవీ హిట్ కొట్టడంపై సంతోషంతో తేలిపోతున్నట్టు కనపించాడు. ఫ్యామిలీస్‌తో వచ్చి జనం ఎంజాయ్ చేస్తున్నారని అన్నాడు. పిచ్చ హ్యాపీ ఫీలవుతున్నానని చెప్పాడు. ఈ థాంక్స్ మీట్‌లో ఇంకా తనేమన్నాడంటే….
‘లోకల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఫీల్డర్స్ లేని గ్రౌండ్‌లో ఫోర్ కొడితే కిక్కే ఉండదు’.. అని ఆ డైలాగ్ ఎడిటింగ్‌లో తీసేశాం కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది. శనివారం మార్నింగ్ షోస్ ఇంకా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా మేము మాట్లాడాము, ఇక నుంచి సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌లీడర్ సినిమాను ఇంతలా ఓన్ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్‌కి ఒక ఎమొటికన్ వాడుతున్నారు. ఇది ఒక నిజమైన గెలుపుగా భావిస్తున్నాం. ప్రతి రివ్యూలోను కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్ కామెడీని అంతగా మెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ అవ్వగానే ఒకటి నోటీస్ చేశాను ప్రియాంక అరుళ్ మోహన్ ఫ్యాన్ క్లబ్‌ను క్రియేట్ చేశారు. ఫస్ట్‌డేనే ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేయడం మంచి విషయం. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌కి మరో హిట్ పడింది అనే మెసేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. మల్లికార్జున థియేటర్‌లో ఫ్యామిలీస్ సినిమాను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నా కజిన్ ఒక వీడియో క్లిప్ తీసి పంపింది. రిలీజ్ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..’