మన తెలుగులో ఇప్పుడు అభిమానుల్లోకి బలంగా వెళ్ళడానికి హీరోలు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు అనే మాట వాస్తవం. అందుకే వేరే హీరోలకు కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఇక తెలుగులో ఈ మధ్య కాలంలో కాస్త కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అదే వాళ్ళ పేరు ముందు ఉండే బిరుదులు మార్చుకోవడం అన్నట్టు. అలా మార్చుకున్న హీరోలను ఒకసారి చూస్తే…
Also Read:దావూద్ సోదరి ఇంట్లో ఈడీ సోదాలు… కీలక పత్రాలు స్వాధీనం!
ఐకాన్ స్టార్ – అల్లు అర్జున్
ఒకప్పుడు స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ బాగా ఫేమస్ అయ్యాడు. కాని ఇప్పుడు మాత్రం ఐకాన్ స్టార్ అంటున్నారు. పుష్ప సినిమాతో బాబు క్రేజ్ బాగా పెరిగింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, సినిమా ట్రైలర్ లో, సినిమా పరిచయంలో కూడా ఐకాన్ స్టార్ గా పెట్టుకున్నాడు.
సుప్రీం హీరో మెగాస్టార్
ఒకప్పుడు చిరంజీవి అంటే సుప్రీం హీరో అని పిలిచే వాళ్ళు. ఇప్పుడు మాత్రం మెగాస్టార్ అంటున్నారు ఆయన అభిమానులు. చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. ఆయనకు మెగాస్టార్ కంటే ముందు డైనమిక్ హీరో అనే గుర్తింపు కూడా ఉండేది. స్టార్ హీరోగా పైకి వస్తున్న క్రమంలో సుప్రీం హీరో అనే వాళ్ళు. మరణ మృదంగం సినిమా నుంచి ఆయన మెగాస్టార్ గా మారిపోయారు.
నట సింహం
అఖండ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ కెరీర్ మొదట్లో యువరత్న అనే వాళ్ళు. ఆ తర్వాత నట సింహం అని పిలుస్తున్నారు.
మన్మధుడు నాగార్జున
యువ దర్శకులకు వరుస అవకాశాలు ఇచ్చే అక్కినేని నాగార్జునకు ముందు యువ సామ్రాట్ అనే పేరు ఉండేది. ఆ తర్వాత కింగ్ సినిమా నుంచి కింగ్ నాగార్జున గా మారింది.
సూపర్ స్టార్ మహేష్
కృష్ణ వారసుడిగా తెలుగులో అగ్ర హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న మహేష్ బాబు బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. మొదటి చిత్రం నుంచి ప్రిన్స్ గా పరిచయం అయిన ఆయన… దూకుడు సినిమా నుంచి ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మారాడు.
ఏ 1 స్టార్ ఎన్టీఆర్
మీసాలు రాకుండానే హీరోగా వచ్చి ఇప్పుడు అగ్ర హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్… బిరుదు కూడా మారింది. ఆయన్ను యంగ్ టైగర్ అని పిలిచే వారు. శక్తి సినిమా తర్వాత ఏ 1 స్టార్ అని పిలిచినా ఆ తర్వాత మళ్ళీ యంగ్ టైగర్ గానే ఉన్నాడు.
Also Read:సరిహద్ధుల్లో యుద్ధ వాతావరణం..!