టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం అనుష్క ఆలయానికి చేరుకునేందుకు పడవలో వస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అనుష్క తన స్వస్థలం మంగుళూర్ నుంచి తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం చేరుకుని అక్కడి నుంచి మరబోటుపై ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. కార్తీక మాసంలో గోదావరి మధ్యలోని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. షూటింగుల కారణంగా గుడికి వెళ్లడం దర్శించుకోవడం వీలు పడకపోవడం వల్ల ఈ కార్తీక మాసంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు చెప్పారు. ప్రకృతి ఒడిలో గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు.