భీష్మ సినిమాతో బిజీ బిజీగా ఉన్న నితిన్ తన ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాడు. భీష్మ తర్వాత రంగ్ దే ఇప్పటికే ఫైనల్ కావటంతో ఆ తర్వాత సినిమా కూడా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. బాలీవుడ్‌లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అందాదున్ రీమేక్‌లో నటించబోతున్నాడు నితిన్. చాలా కాలం క్రితమే ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటికీ సరైన దర్శకుడి కోసం ఎదురు చూస్తున్న నితిన్‌కు ఫైనల్‌గా డైరెక్టర్ దొరికేశాడు.
డైరెక్టర్ సుధీర్ వర్మ నితిన్ రీమేక్ సినిమా చేయబోతున్నాడు. ఆ యేడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ తెరకెక్కించబోతుంది