మాములుగా మద్యం పాణం ఆరోగ్యానికి హానికరం అని సినిమాల్లో చెప్పే హీరోలు ఇప్పుడు రోడ్ల మీద మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. నీకు నాకు డాష్ డాష్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం రాత్రి విధుల్లో భాగంగా పోలీసులు కూకట్ పల్లి లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అటు గా వస్తున్న ప్రిన్స్ మద్యం సేవించినట్టు గుర్తించిన పోలీసులు కార్ ని సీజ్ చేసి ప్రిన్స్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం కూకట్ పల్లి కోర్ట్ ముందు హాజరయ్యారు హీరో ప్రిన్స్.
ALSO READ:
అమెరికా లో హైదరాబాద్ యువతి మృతి
అమృత కుటుంబానికి మళ్లీ మారుతీరావు బెదిరింపులు
జబర్ధస్త్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు