టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. వైజాగ్‌లోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఆయన సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ చిత్రాల్లో నటించారు. ఆయన పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. సుధీర్ మరణ వార్తను నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కుందనపు బొమ్మ సినిమాలో సుధాకర్ కోమాకుల లీడ్ యాక్టర్‌గా నటించారు.
సుధీర్ వర్మ మరణంపై పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సుధీర్ వర్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సుధీర్ వర్మ అంత్యక్రియలను ఈ రోజు లేదా రేపు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.