టాలీవుడ్ ముద్దుగుమ్మలు, బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ మధ్య కాలంలో ట్రెండ్ మార్చారు. ఇంతకు ముందు వరకు పెళ్లి అయిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అవ్వడమే కానీ.. హీరోయిన్ గా రాణించిన వారు చాలా తక్కువ మంది. కానీ ఇప్పుడు కాలం మారింది..పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వారు కూడా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు.
మరీ ముఖ్యంగా హిందీలో చూసుకుంటే అందరూ పెళ్లైన హీరోయిన్లే ఉన్నారు. అసలు పెళ్లికి కెరీర్ కు ఏ మాత్రం సంబంధం లేదు అన్నట్లు ఉన్నారు వాళ్లు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు.బాలీవుడ్ లో దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్, తాజాగా కియరా అద్వానీ వీళ్లందరూ పెళ్లయిన ముద్దుగుమ్మలే.
కానీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్లే. ఒక్కో సినిమాకు కనీసం 10 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటారు వీళ్లు. అలాగే సౌత్‌లో కూడా ఈ ట్రెండ్ వచ్చేసింది. ఇక్కడ కూడా నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత ఒక్కో సినిమాకు 2 గురించి 3 కోట్ల వరకు పారితోషకం అందుకుంది. అతనితో విడిపోయిన తర్వాత ఈమె క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది.
తాజాగా కాజల్ అగర్వాల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ బలంగా ప్లాన్ చేసుకుంటుంది. రెండేళ్లుగా సినిమాలు చేయని ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బాలకృష్ణ సినిమాతో పాటు.. అజిత్ సినిమాకు కూడా సైన్ చేసినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాలో కాజల్ ను తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
ఆ సినిమా కోసం రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది చందమామ. పెళ్లికి ముందు కూడా సినిమాలు చేసిన కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్యలోనే ఈమె పారితోషికం ఉండేది. కానీ పెళ్లి తర్వాత మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది కాజల్. ఏదేమైనా ఈ మధ్య పెళ్లయిన హీరోయిన్లకు ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిపోయింది. మరోవైపు నిర్మాతలు కూడా తమ సినిమాకు ఆ హీరోయిన్ వల్ల క్రేజ్ వస్తుంది అనుకుంటే ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా రెడీ అయిపోతున్నారు.