అందం చూడవయా…ఆనందించవయా.. అంటూ సినీ భామలు అదరగొట్టే డ్రెస్‌లతో కేక పెట్టించేస్తున్నారు. ఫాన్స్ ఫాలోయింగ్ ఉంటేనే ఏ హీరోయిన్‌కైనా మార్కెట్ పెరుగుతుంది. అందుకే హీరోయిన్స్ అందరూ న్యూ ట్రెండ్ పట్టారు. అభిమానులకు హాట్ ట్వీట్ చేయడం నయా పబ్లిసిటీ. హాట్..హాట్ షార్ట్ పీస్ డ్రెస్సులతో ఫోటో షూట్ చేసి ఇన్‌స్ట్రాగ్రామ్, ఎఫ్‌బీలలో పోస్ట్ చేయడం.. ట్వీట్‌లు చేయడంతో ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
కింగ్ నాగార్జునతో మన్మధుడు-2లో మురిపించిన వయ్యారి రకుల్ ప్రీత్ సింగ్…ఆ మూవీ ఫెయిల్యూర్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ఫాన్స్‌కు మరింత జోష్ ఇవ్వడానికి తాజాగా స్పెయిన్ ఐబిజా ఐలాండ్లో బికినీలో హాట్ ఫోటో షూట్ చేసింది.ఆహ్లాదం.. ఆనందం కోసమే సాగర తీర విహారం అంటూ తన అందచందాలతో ఫాన్స్ మతిపోగొట్టేసింది రకుల్. బ్లష్ బ్యూటీ రేస్‌లో వెనకపడితే అంతే సంగతి మరి. అందుకే ఈ అందాల ఆరపోత. ఇది ఫాన్స్‌కు ఫ్రీ టికెట్.
ఇక మరో భామ కాజల్ అగర్వాల్ తానేమీ తక్కువ కాదంటోంది. స్లీపింగ్…షూటింగ్…మేకప్..ప్యాకప్..డైలీ లైఫ్ బోర్…కాస్త కొత్తగా ట్రై చేద్దాం బాస్ అంటోంది కాజల్. హద్దులు దాటితేనే మజా…ఆల్రెడీ డైరెక్టర్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తెచ్చేశారంటోంది.
బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ పెళ్లాయక మరింత గ్లామర్ చూపులతో పిచ్చెక్కిస్తోందని ఫాన్స్ సంబరపడిపోతున్నారు. కరేబియన్ దీవుల్లో అను బ్యూటీ.. బాగా ఖుషీ అయినట్టు కనిపిస్తోంది. ఆ దృశ్యాలను ఫాన్స్ ముందుంచింది. వెస్టిండీస్ ఆంటిగ్వా బీచ్‌లో బికినీతో సూపర్ పోజు ఫోటో తీయించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఇప్పుడో హాట్ టాపిక్. ‘సన్ కిస్డ్ అండ్ బ్లెస్డ్’ క్యాప్షన్‌తో అనుష్కశర్మ హాట్ ఫోటో షూట్ అందర్నీ ఫిదా చేసింది.
సోషల్ మీడియా వేదికలపై ఇలా ఫాలోయింగ్ పెంచేసుకుందామంటే ఒక్కోసారి సీన్ రివర్స్ కూడా అవుతుంది. రష్మిక మందన్న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కొత్త మూవీ టైటిల్ సుల్తాన్ పేరు చెప్పేసి వివాదంలో పడింది. మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ భారీ ప్రోగ్రాంతో విడుదల చేద్దామనుకున్నఆ చిత్ర యూనిట్ రష్మిక ట్వీట్‌పై మండిపడింది. హాట్ హాట్ ముచ్ఛట్లు కాస్తా హాట్..హాట్.. టాపిక్ అయ్యింది !!