బయట జోరుగా వాన పడుతుంటే వేడివేడి పకోడిలో, బజ్జీలో లేక మొక్కజొన్న పొత్తులో లాగించడం అంటే… ఆహా….. నోరు ఉరుతుంది కదా..! మీకే కాదు నాకు కూడా అలాగే తినాలనిపిస్తోంది…అంటుంది కథానాయిక లావణ్య త్రిపాఠి.
చిరు చినుకులు పడుతున్నప్పుడు అల్లం టీ తో పాటు వేడివేడి బజ్జీలు ఆరగించడం అంటే తనకూ చాలా ఇష్టమంటుంది ఈ భామ.
‘వర్షాకాలంలో వేడివేడి స్నాక్స్ ఇష్టపడతా. అందులోనూ బజ్జీలంటే భలే ఇష్టం. ఇదీ, అదీ అనే తేడా లేదు. మిర్చి, ఆలూ, ఉల్లి, వంకాయ.. అన్నిరకాల బజ్జీలనూ ఇష్టంగా తింటాను. కాకపోతే వేడివేడిగా అల్లం టీ కాంబినేషన్ ఉండాల్సిందే’ అంటూ తన ఇష్టాన్ని పంచుకుంటున్నది లావణ్య.
ఏది ఏమైనప్పటికీ చల్లని వాతావరణంలో వేడివేడి ఫలహారాలను తినడానికి సెలబ్రిటీలేమి అతితులు కారు అని తెలుస్తోంది.