రిమ్.. జిమ్.. ఇది ఫిట్నెస్ మంత్రం. టాలీవుడ్ హీరోయిన్లకు ఇది నిత్య వేదం. జిమ్ అలవాటు లేకుంటే ఇక అంతే సంగతులు. లావయిపోతాం. అందుకే అందాల బొమ్మలు రోజూ కసరత్తులు చేయాల్సిందే.
టాలీవుడ్ బ్యూటీ సమంత కొత్త ట్రెండ్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుందట. నిత్యం కొత్త లుక్ వుండాలని తాపత్రయం. అందుకోసం ఖరీదైన దుస్తులు కొనేస్తుంది. మంచి అవుట్ ఫిట్ ఉండేలా సమంత తపన పడుతుంది.
జిమ్ సెషన్స్ సమంతకు ఎంతో ఇష్టం. అందుకే తన ఫిట్నెస్ ట్రైనర్ దయా రాజేష్ ఏం చెబితే అది చేసేస్తుంది.
ఫిట్‌నెస్ సెలబ్రిటీగా సమంత ఫేమస్. ఉదయాన్నే 5 గంటలకు జిమ్ సెషన్ తప్పనిసరి. షూటింగ్ ఉంటే జాగింగ్ చేస్తుంది.
తిండి విషయంలో సమంత కేలరీలు కౌంట్ చేయదు. నచ్చినంత తింటుంది. ఆ మేరకు వర్కవుట్లు చేస్తుంది. అన్నం, సాంబార్, చికెన్, ఫిష్, స్వీట్ పొంగల్, ఫిల్టర్ కాఫీ సమంత ఫేవరేట్స్. సమంత బ్యాగ్‌లో ఎప్పుడూ సన్ స్క్రీన్ లోషన్ ఉంటుంది. ఎండలో షూటింగ్ చేసినప్పుడు అందం కందిపోకూడదు కదా..! అందుకే జాగ్రత్త తప్పదు.
సమంత మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీసు చేస్తుంది. చేతికర్రను నేర్పుగా తిప్పే కళ సిలంబం బాగా నేర్చుకుంది. అలవోకగా చేతికర్ర సాము చేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని సమంతతో ఎవరైనా డైరెక్టర్ ఓ మూవీ ప్లాన్ చేస్తారేమో ! సమంత ప్రతి మూవీని తొలి సినిమాగానే ఫీలవుతుంది. చక్కని లైఫ్ స్టయిల్‌తో ఫాన్స్‌ను అలరిస్తుంది.