దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ ఉద్వేగంగా స్పందిస్తోంది. ఐ లవ్ తెలంగాణ, భయాన్ని కల్పించటం కూడా ఒక్కోసారి మంచిదే అంటూ సమంత ట్వీట్ చేశారు. మంచు మనోజ్ అయితే… ఆ బుల్లెట్‌ను దాచుకోవాలని ఉంది, నీ ఆత్మకు శాంతి జరిగింది చెల్లమ్మా అంటూ ట్వీట్ చేశారు.
న్యాయం జరిగిన వార్తతో నిద్రలేచాను అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేయగా, న్యాయం జరిగింది… దిశ ఆత్మకు శాంతి కలగాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీటీ చేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మా ట్రైలర్లను, టీజర్లను లైక్ చేయకపోయినా పర్వాలేదు, ఈ ఎన్‌కౌంటర్ న్యూస్ మాత్రం ట్రెండింగ్ చేయండి, ఇలా జరిగిందని చాటింపు వేయండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తన ట్వీట్టర్ ఖాతాకు తన ఫోటో బదులుగా సీపీ సజ్జనార్ ఫోటో పెట్టుకున్నారు.
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసోడు అయ్యుండాలి అంటూ హీరో నాని ట్వీట్ చేశారు.