రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్… టాలీవుడ్ లో అగ్రహీరోల సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. సందర్భానికి తగ్గట్టు సాంగ్స్ ఇస్తూ మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్ ఇస్తూ ప్రేక్షకులను ఉర్రుతలూగించగల దేవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ దేవికి విషెస్ తెలిపారు. సూపర్‌స్టార్ మహేశ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సహా సెలబ్రిటీలందరూ దేవిశ్రీ ప్రసాద్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్‌కల్యాణ్, మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లే కాకుండా యంగ్ హీరోలకు సైతం మ్యూజిక్ అందించాడు దేవి.