తెలుగు ఇండస్ట్రీ నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ నుంచి కూడా కొన్ని చిత్రాలు డబ్బింగ్ వెర్షన్ ద్వారా విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పుడు సూపర్ టాలెంటెడ్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన గంగూభాయ్ కతియావాడి సినిమాతో అలియాభట్ తెలుగు లో సందడి చేయబోతున్నారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రాగా, నిర్మాతలు డబ్బింగ్ వెర్షన్‌లో అదే రోజున తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో దూకుడుగా సినిమా ప్రమోషన్స్‌తో పాటు ప్రతి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంది అలియా.
గంగూభాయ్ కతియావాడికి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాలోని కొన్ని మాస్ సెంటర్లలో మంచి వసూళ్లు లభిస్తాయని అంచనా వేస్తున్నారు మేకర్స్. ఇక ఈ చిత్రం ముంబై వ్యభిచారం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాగా అలియా భట్ పై తెలుగు డిస్ట్రిబ్యూటర్ల అంచనాలు ఏమవుతాయో చూడాలి.