అమ్మా ప్రియాంకా… ఏంది తల్లీ ఈ దారుణం…
వెటర్నరీ ప్రియాంక రెడ్డి హత్య, పోలీసులు మాట్లాడిన తీరుపై టాలీవుడ్ ఫైర్ అవుతోంది. మా అమ్మాయి ఇంటికి రాలేదు సర్ అని పోలీసులకు ప్రియాంక రెడ్డి తల్లితండ్రులు ఫోన్ చేస్తే లవర్‌తో పోయిందేమో అని మాట్లాడటంపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. పోలీసులకు ఇది మర్యాదగా అనిపించుకోదు. లేచిపోయిందేమో అని అడిగిన పోలీసులకు సిగ్గుగా లేదా.. అసహ్యమేస్తోంది. వాట్ ద …. అంటూ బూతులు తిట్టింది.
ప్రియాంకను చిదిమేసిన మృగాడు వీడే
మహనటి ఫేం కీర్తి సురేష్ స్పందిస్తూ… హైదరాబాద్ నగరంలో ఇలాంటి చర్యా…? మాటలు రావటం లేదు. ఇంత దారుణమా… నా గుండే బాధతో బరువెక్కిపోయిందని తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ప్రియాంక రెడ్డి తల్లితండ్రులకు దేవుడు దైర్యం ఇవ్వాలని ప్రార్థించింది.
ఇక టాలీవుడ్ ప్రముఖులు వివి వినాయక్, అల్లు శిరిష్, చిన్మయి తదితరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
లవర్‌తో పోయిందేమో… ప్రియాంక కేసులో పోలీసుల ఓవరాక్షన్?