సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరిని హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. రూ.55 కోట్ల మేర మోసం చేశాడని ఎన్ స్క్వైర్ కంపెనీ డైరెక్టర్లు చేసిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో ఎన్ స్క్వైర్ కంపెనీలో నవీన్ రెడ్డి డైరెక్టర్ గా పని చేశాడు.
అదే సమయంలో సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. అలాగే ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎన్ స్క్వైర్ కంపెనీ డైరెక్టర్ల ఫిర్యాదు మేరకు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నవీన్ రెడ్డిపై 420, 465, 471 R/W 34 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం చర్లపల్లి జైలుకు పంపించారు. మోసం చేసిన ఈ డబ్బులతో నవీన్ రెడ్డి ‘నో బడీ’ అనే పేరుతో హీరోగా సినిమా చేశాడు.
నవీన్ స్వగ్రామం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కోడిపుంజులగూడెం. ఇతనిపై బైక్ దొంగతనం కేసులు కూడా చాలానే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే విచారించే కొద్దీ నవీన్ చిట్టా బయటికొచ్చే ఛాన్స్ ఉంది.