మాజీ మంత్రి బీజేపీ నేత పైడికొండల మాణిక్యరావు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా మాణిక్యాలరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలై అంచలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు. భారతీయ జనతా పార్టీకి ఆయన చేసిన సేవను మరువలేము. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణవార్త వినగానే చాలా బాధేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు మాజీ మంత్రి శ్రీ పి. మాణిక్యాలరావుగారు మరణించారనే వార్త తెలిసి చాలా బాధేసింది. ఆయన దయా హృదయం కలవారు. సామాన్యుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన క్షమశిక్షణతో ఎదుగుతూ.. కీలకమైన పదవులను అధిరోహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చిరు ట్వీట్ చేశారు.
Saddened to learn about prominent politician & Ex.Minister Sri.P.Manikyala Rao's demise due to Corona.A compassionate human being,Sri.Rao made a humble beginning & grew to assume important political positions. May his soul rest in peace.Deepest condolences to his family members
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 1, 2020