అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుస హిట్స్ తో స్టార్ హీరోగా మారిపోయాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు అయ్యే అవకాశం కూడా వచ్చింది. కానీ ఎందుకో తెలియదు ఆ పెళ్లి తప్పిపోయింది. అలాగే అక్కడితో ఆయన కెరీర్ కూడా అర్ధాంతరంగా ముగిసిపోయింది.

మొదట చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ మంచితనం నచ్చి కూతురు సుస్మిత ను ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఏం జరిగిందో తెలీదు క్యాన్సిల్ అయింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్ కు అవకాశాలు తగ్గిపోయాయి. కెరీర్ మొత్తం నాశనం అయింది.
కాగా మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పారు. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు రోజు రాత్రి మూడు గంటల పాటు ఫోన్ లో మాట్లాడాడని నేను బాధపడుతూ ఉంటే ఆయన ఓదార్చారని అన్నారు.
RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు
భవిష్యత్తులో తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ ధైర్యం చెప్పారని ఆ మాటలు విన్నాక డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని కొంత ధైర్యం కూడా వచ్చింది అని చెప్పారు. అయితే అలా నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు ఉదయ్ కిరణ్ కాదని, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో మాత్రం ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పారు. చనిపోయేముందు రోజు నాతో పాటు పూరి, తేజ తో కూడా ఉదయ్ కిరణ్ ఫోన్లో మాట్లాడారు అని అయితే అవే ఆయన చివరి మాటలు అవుతాయని ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు ఆదిత్య.
శ్రీదేవిని పెళ్లి చేసుకావాల్సిన తెలుగు హీరోస్ ఎవరో తెలుసా ?