థర్డ్ వేవ్ కారణంగా మరోసారి సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. పెద్ద సినిమాల విడుదలలు కూడా నిలిచిపోయాయి. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఖాళీగా లేరు. ఊహించని విధంగా మరోసారి వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని హీరోలు తమదైన స్టయిల్ లో ఆస్వాదిస్తున్నారు. ముందుగా ప్రభాస్ నుంచి స్టార్ట్ చేద్దాం.
ఈ హీరో గుట్టుచప్పుడు కాకుండా యూరోప్ టూర్ ముగించేశాడు. ఓవైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే, ప్రభాస్ మాత్రం సైలెంట్ గా యూరోప్ వెళ్లి.. 3 దేశాల్లో సేదతీరి.. మొన్ననే తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఇంత సడెన్ గా ప్రభాస్ యూరోప్ ఎందుకు వెళ్లాడు? ఒక్కడే వెళ్లాడా.. కూడా ఎవరైనా ఉన్నారా లాంటి విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
ప్రభాస్ ఇలా వెళ్లి వచ్చాడో లేదో ఇప్పుడు బన్నీ వంతొచ్చింది. ఈ హీరో కూడా టూర్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం దుబాయ్ లో ల్యాండ్ అయ్యాడు. కుటుంబంతో సహా దుబాయ్ లో ల్యాండ్ అయిన అల్లు అర్జున్.. ఆరా స్కైపూల్ లో దిగాడు. ఇక్కడ్నుంచి చూసే దుబాయ్ లోని అద్భుత కట్టడాలన్నీ ఒకేసారి కళ్లముందు కనిపిస్తాయి. దీన్ని 360 డిగ్రీల ఇన్ఫినిటీ పూల్ అని కూడా అంటారు.
ఈ వారం దుబాయ్ లోనే ఉండబోతున్నాడు బన్నీ. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత.. ఫిబ్రవరిలో హైదరాబాద్ రాబోతున్నాడు. ఏప్రిల్ నుంచి పుష్ప-2 సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ.