ఒకసారి స్టార్ అయిన తర్వాత వచ్చే ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు సినిమాలో ఉండే స్టార్ లకు ఒకసారి ఇమేజ్ వచ్చి… వాళ్ళ సినిమాలు వరుసగా హిట్ అయితే, ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంటే మాత్రం ఆదాయం అంతా ఇంతా కాదు. అలా ఆదాయం భారీగా సంపాదించే వారిలో చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు ఎక్కువగానే ఉంది లిస్టు. ఇక వీరిలో కొందరికి ప్రత్యేక విమానాలు కూడా ఉన్నాయి. అలా విమానాలు కొనుగోలు చేసిన హీరోలను ఒకసారి చూస్తే…
Also Read:ఎమ్మెల్యేలకు ఐఫోన్ ఆఫర్
చిరంజీవి
ఆయనకు సొంతగా ఒక విమానం ఉంది. ఆ జెట్ విమానం కోసం రామ్ చరణ్ దాదాపుగా 80 కోట్ల వరకు ఖర్చు చేయడం విశేషం. ఫ్యామిలీ టూర్స్ కి మాత్రమే దీన్ని వాడుకుంటారు.
ఎన్టీఆర్:
సొంత కాళ్ల మీద స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఆదాయం కూడా భారీగానే ఉంది. మూడేళ్ల క్రితం 80 కోట్లు ఖర్చు చేసి సొంతవిమానం కొన్నాడు.
అల్లు అర్జున్
సిల్వర్ స్పూన్ తో పుట్టిన ఈ హీరోకి సొంత విమానం ఉంది. కేవలం తన కుటుంబం కోసం మాత్రమే సొంత ఫ్లైట్ కొనుక్కున్నాడు ఈ హీరో.
నాగార్జున
సినిమాల కంటే వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేసిన అక్కినేని నాగార్జున… ఫ్యామిలీ తో ఎక్కడికి అయినా వెళ్ళడానికి విమానం కొన్నారట. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ తో పాటు బిగ్ బాస్ ను కవర్ చేయడానికి విమానాన్నే నమ్ముకున్నారు.