చాలా మంది స్టార్ హీరోలు వారి క్రేజ్ ను ఉపయోగించుకుని యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటారు. అందుకు గాను అంతే మొత్తం లో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటారు. అయితే ఆయా కంపెనీలు కూడా ఉత్పత్తులను పెంచుకోవడం కోసం క్రేజ్ వున్న హీరోలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఈ యాడ్స్ లో నటించాలని కోరుతూ ఉంటారు.
అయితే కొంతమంది హీరోలు మాత్రం ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామన్నా నటించడానికి ఒప్పుకోరు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది టాప్ హీరోలు యాడ్స్ లో నటిస్తున్నారు. మరి కొంతమంది హీరోలు మాత్రం అందుకు నో చెబుతూ వస్తున్నారు. అందులో మొదటగా నందమూరి బాలకృష్ణ, ఇప్పటివరకు ఎలాంటి యాడ్ లో కూడా నటించలేదు. ఎన్నో ఆఫర్స్ వచ్చినా జనాలకి ఉపయోగపడేవి అయితే ఉచితంగా నటిస్తానని అంతేగాని డబ్బులు తీసుకొని మోసం చేయానని చెప్తారు బాలయ్య. అలాగే మోహన్ బాబు… ఈయనకు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు భారీ రెమ్యూనరేషన్ తో ఆఫర్ ఇచ్చారు. కానీ మోహన్ బాబు అందుకు ఒప్పుకోలేదు.
అలాగే నందమూరి కళ్యాణ్ రామ్…ఈయనకు కూడా ఎన్నో ఆఫర్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడు. అనుష్క శెట్టికి కూడా మంచి స్టార్డమ్ ఉన్నప్పుడు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె కూడా నో చెప్పింది. అలాగే సౌత్ టాప్ నటి గౌతమి… ఈమెకి కూడా మంచి ఆఫర్లు వచ్చాయట. అయినప్పటికీ ఆమె నో చెబుతూ వచ్చిందట.
విరాట పర్వం రియల్ స్టొరీ… సరళ ను అన్న లే చంపేశారా ?
సాయి పల్లవి…సాయి పల్లవికి ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ చేయాలంటు ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీ వారు ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమయ్యారు. కానీ సాయి పల్లవి మాత్రం నో చెప్పింది. మంచు విష్ణు కు కూడా కెరీర్ లో స్టార్టింగ్ లో మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ విష్ణు మాత్రం వాటికి నో చెప్పాడు. అలాగే మంచు మనోజ్, అల్లరి నరేష్, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలామంది స్టార్ హీరోలు మంచి ఆఫర్లు వచ్చినా వదులుకున్నారు.
టిక్ టాక్ దుర్గారావు బ్యాక్ గ్రౌండ్ తెలుసా? అంత కష్టపడ్డాడా!