బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు డ్రగ్స్ చుట్టూ తిరుగుతోంది. బాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ కామన్ అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరింత వేడిపుట్టించింది.
బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ డ్రగ్స్ వాడకటం కామనైపోయిందని నటి, బీజేపీ నేత మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై తెలంగా ఎన్‌సీబీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అంటూ ఫేస్ బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకంపై సీరీయస్ గా దృష్టిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో ఎక్సైజ్ అధికారిగా ఐపీఎస్ అకున్ సబర్వాల్ హాయంలో టాలీవుడ్ లో పలువురి అగ్ర తారల పేర్లు డ్రాగ్స్ ఇష్యూలో భయటకు వచ్చాయి. వారంతా విచారణకు కూడా హజరయ్యారు. కానీ వారంతా బాధితులేనని… సప్లై చేయలేదంటూ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు.