ఇండస్ట్రీ కి చాలామంది హీరోయిన్లు వచ్చి పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే స్టార్ డమ్ ను తెచ్చుకుంటారు. మరి కొంతమంది హీరోయిన్లు చేసినది ఒకటే సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోతూ ఉంటారు.
అందులో మొదటగా చెప్పుకోవాల్సింది నువ్వే కావాలి హీరోయిన్ రిచా. ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది రిచా. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.
ఇక మరో హీరోయిన్ అన్షు. ఈ అమ్మడు టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరో మన్మధుడు సినిమాలో కూడా నటించింది. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ బ్యూటీ ఎక్కడా కనిపించలేదు.
ఇంకో అనురాధ మెహతా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా లో అనురాధ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలు అంత సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడు కనిపించకుండా పోయింది.
ఈ లిస్టు లో దిల్ సినిమా హీరోయిన్ నేహా కూడా ఉంది. యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో నేహా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఎక్కడా కనిపించకుండా పోయింది.
అలాగే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ జానీ, బద్రి సినిమాలలో నటించింది. తర్వాత ఎక్కడ కనిపించలేదు. నిజానికి రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ప్రేమలో ఉన్న సమయంలోనే పవన్ తో జానీ సినిమా చేసింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది.
హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు సినిమాలో భానుశ్రీ నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దేనితో ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఎక్కడా కనిపించలేదు.
అలాగే గౌరీ ముంజల్… వి.వి.వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బన్నీ సినిమాలో గౌరీ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఎక్కడా కనిపించలేదు.
అలాగే మీరాచోప్రా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా లో ఈ బ్యూటీ నటించింది. కానీ ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిరుత హీరోయిన్ నేహ శర్మ. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన నేహా ఆ తర్వాత తెరపై కనిపించలేదు.
అలాగే కార్తీక నాయర్ జోష్, దమ్ము, రంగం వంటి చిత్రాలలో నటించిన ఈ అమ్మడు కూడా తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయింది.
అలాగే హీరోయిన్ శ్యామిలి. బేబీ ఫ్యామిలీ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు కూడా ఒకటి రెండు సినిమాలు చేసి టాలీవుడ్ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.
అలాగే పాయల్ ఘోష్… మంచు మనోజ్ నటించిన ప్రయాణం, ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో నటించింది. ఈ సినిమాల తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ నుంచి అదృశ్యమైంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా హీరోయిన్ సారా జైన్. పంజా చేసిన తరువాత కొన్ని హిందీ సినిమాల్లో నటించింది. ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు.
Advertisements
Also Read: టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్న 10 మంది బ్రదర్స్ ఎవరంటే?