ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల ఒరిజినల్ నేమ్స్ ఎంతమందికి తెలుసు. హీరోలకు ఒరిజినల్ నేమ్స్ ఏంటి అనుకుంటున్నారా ? అవును మనం ప్రస్తుతం అభిమానిస్తున్న సినీ హీరోలకు అసలు పేర్లు వేరే ఉన్నాయి.
మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.
ఇక మెగాస్టార్ చిరంజీవి.. 150కి పైగా చిత్రాలలో నటించి టాలీవుడ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి. అయితే చిరు అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.
అలాగే సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు.
అలాగే నాని, నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఎంతో మంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే నాని అసలు పేరు గంట నవీన్ బాబు.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, పేరుకే తమిళ్ హీరో.. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా రజనీకాంత్ కు అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరాజ్ గైక్వాడ్.
ఇక మరో హీరో మోహన్ బాబు, మంచు మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ప్రస్తుతం మోహన్ బాబు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తున్నారు.
కమల్ హాసన్, కమల్ హాసన్ గురించి కూడా సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కమలహాసన్ పూర్తి పేరు పార్థసారథి శ్రీనివాసన్.
మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు.
అలాగే తమిళ హీరో ధనుష్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు.
మరో తమిళ హీరో సూర్య, సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్.
అలాగే సీనియర్ హీరో విక్రమ్ అసలు పేరు కెనడి జాన్ విక్టర్.
కే జి ఎఫ్ హీరో యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.
తమిళ స్టార్ హీరో విజయ్, అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రకాంత్