డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ చేసి రెట్టింపు చేయడం మరో ఎత్తు. ప్రతీమనిషికీ ఆర్ధిక క్రమశిక్షణ, డబ్బు దాని మౌళిక శక్తి గురించి అవగాహన కూడా చాలా అవసరం.
సినీ రంగంలో ఈ మనీ మేనేజ్మెంట్ తెలియక అలనాటి నటీనటులు చివరిదశలో చాలా కష్టాలు పడ్డారన్నది అందరికీ తెలిసిన విషయం. అందుకే కొంత మంది సినీప్రముఖులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా వారి సొమ్ముని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. డబ్బుతో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవైపు సినిమా అవకాశాలు కంటిన్యూ చేస్తూనే మరోవైపు ఇతర బిజినెస్లు ప్రారంభిస్తున్నారు.. మన టాలివుడ్ హీరోల సైడ్ బిజినెస్ లు ఏంటో ఓ లుక్కేయండి..!
చిరంజీవి:
సొంత నిర్మాణ సంస్థ ఉంది.. దాంతో పాటు కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నాగార్జున, సచిన్ కలిసి క్రీడారంగంలో ఫ్రాంచైజిని కూడా కలిగి ఉన్నారు మెగాస్టార్.
నాగార్జున:
చిరంజీవి, సచిన్ లతో పాటు కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కో పార్టనర్.. హైటెక్ సిటిలోని N కన్వెన్షన్ సెంటర్, N-గ్రిల్ మరియు యాన్ ఏషియన్ రెస్టారెంట్లు నాగర్జునకు చెందినవే..
మోహన్ బాబు:
శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు మోహన్ బాబు కుటుంబానికి చెందినవే..తొలుత తిరుపతిలో బ్రాంచ్ ప్రారంభించిన మోహన్ బాబు..తర్వాత నాలుగు బ్రాంచ్ లు ఓపెన్ చేసి హైదరాబాద్ కి విస్తరింపచేశారు.
అల్లు అర్జున్:
“800 జూబ్లీ బార్ అండ్ పబ్” అల్లు అర్జున్ కి చెందినది.. ఈ పబ్ ని మనం జై లవకుశ సినిమాలో చూడవచ్చు.అందులో ప్రియదర్శి పార్టి ఇచ్చేది 800 జూబ్లిలోనే.
మహేశ్ బాబు:
సొంత ప్రొడక్షన్ హౌజ్ ని కలిగి ఉన్నాడు మహేశ్ బాబు.. “AMB సినిమాస్” ని ఇటీవల ప్రారంభించారు..అంతేకాదు The HUMBLE.CO పేరుతో గార్మెంట్స్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు.
సందీప్ కిషన్:
సందీప్ కిషన్ మరియు అతని స్నేహితులు కలిసి ప్రారంభించిన రెస్టారెంట్ “వివాహ బోజనంబు”.ఇఫ్పటికి హైదరాబాద్ లో మూడు బ్రాంచిలను ప్రారంభించారు.. ప్రతీ ఏడాది డిసెంబర్ లో మరో కొత్త బ్రాంచ్ ని ఏర్పాటు చేస్తుంటారు.
రాంచరణ్:
హైదరాబాద్ లో పోలో మరియు రైడింగ్ క్లబ్ కలిగి ఉన్నాడు రాంచరణ్..అంతేకాదు తెలంగాణా ఆధారిత విమానయాన సంస్థ “ట్రూజెట్” ని కలిగి ఉన్నాడు.
రానా:
“CAA-KAWN” అనే మేనేజ్మెంట్ కంపెనిలో భాగం కలిగి ఉన్నాడు రానా.
శర్వానంద్:
జపనీస్ మరియు అరేబియా కాఫీ రుచులలో ప్రత్యేకత కలిగిన “బీన్జ్: ది అర్బన్ కాఫీ విలేజ్” అనే కేఫ్ ఆయన సొంతం.
శశాంక్:
సై సినిమాలో నితిన్ తో కలిసి నటించిన శశాంక్.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ లోనికి అడుగుపెట్టాడు. శశాంక్ ప్రారంభించిన రెస్టారెంట్ పేరు “మాయాబజార్”.
జగపతిబాబు:
“క్లిక్ సిని ఆర్ట్” అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించాడు నటుడు జగపతిబాబు.
విజయ్ దేవరకొండ:
“ROWDY” పేరుతో ఒక బట్టల బ్రాండ్ ని ప్రారంభించాడు విజయ్ దేవరకొండ.. తన నటనతోనే కాదు..తన ఫ్యూచర్ ఫ్లాన్స్ తో కూడా అభిమానులను సంపాదించుకుంటున్నాడు విజయ్.
మంచు విష్ణు:
విష్ణు తన భార్య వెరోనికా తో కలిసి “న్యూయార్క్ అకాడెమి” అనే స్కూల్ ని ప్రారంభించారు. అంతర్జాతియ ప్రమాణాలతో నడిపే ఈ స్కూల్ కి మంచు విష్ణు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.