సాధారణంగా ఇండస్ట్రీలో నటులు ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. కానీ తమ కెరీర్లో మలుపు తిప్పే పాత్రలు మాత్రం కొన్నే ఉంటాయి అని చెప్పాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది నటుల కెరీర్ లో మలుపు తిప్పిన పాత్రలు ఏంటో తెలుసుకుందాం.
తాను చేస్తున్న పాత్రలు నచ్చక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు ప్రకాష్‌రాజ్. కానీ ఆ తర్వాత అంతఃపురం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పాత్రకు ఉండే సీమ మాండలీకం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఈ పాత్ర ప్రకాష్ రాజ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది.
ఇండస్ట్రీలో రియల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే శ్రీహరి కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించాడు అన్న విషయం తెలిసిందే. అయితే శ్రీహరి విలన్ పాత్రలు చేస్తున్న సమయంలో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాల్లో కెరీర్ లోనే ఒక పాజిటివ్ రోల్ చేశారు. ఇది శ్రీహరి కెరీర్ లో మైలరాయిగా మిగిలిపోయింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో లెజెండ్ సినిమాలో జితేంద్ర అనే క్యారెక్టర్ జగపతిబాబుకి దక్కింది. తర్వాత కెరీర్ మారిపోయింది.
అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న హీరోగా ఉన్న విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి సినిమాలోని అర్జున్ పాత్ర ఎంత క్రేజ్ తీసుకొచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక విజయ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోవడానికి ఈ పాత్ర కారణం అని చెప్పాలి.
తెలుగు దర్శకుడు రవిరాజ పినిశెట్టి అబ్బాయిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిశ్రమమైన ఆది పినిశెట్టి తమిళంలో హీరోగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ ను ఢీకొట్టే పాత్రలో నటించాడు.ఈ పాత్ర ఆది పిని శెట్టి కెరీర్ని మలుపు తిప్పింది అని చెప్పాలి.