ఎట్టకేలకు గురువారం తెలుగు సినీ పరిశ్రమ స్టార్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి టిక్కెట్ ధర విషయంపై క్లారిటీ తీసుకున్నారు. వాస్తవానికి, జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్, చిరు, ప్రభాస్ లతో చేరుతున్నట్లు టాక్ నడిచింది. కానీ కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాలేకపోయాడట.
ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్ లిస్ట్‌తో పాటు సీఎంఓలో జగన్‌ను కలిసిన వారి లిస్టులో కూడా ఆయన పేరు ఉందట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉండగా ఈ రోజు మహేష్ బాబు పెళ్లి రోజు. తన రోజు అయినప్పటికీ, మహేష్ బాబు మీటింగ్ కు హాజరు అయ్యారు. దీనితో సినీ అభిమానులు మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలోనే మరో పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ కు పెళ్లి రోజులు శుభాకాంక్షలు చెప్తూ చిరు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివలు దిగిన ఫోటోను ఎడిట్ చేసి పవన్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, చరణ్ ల పేస్ మార్ఫింగ్ చేశారు . ఆ ఫొటోలో టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ పిక్ వైరల్ అవుతుంది.