కొత్త సంవత్సరంలో సరికొత్త సినిమాకి కొబ్బరికాయ కొడతానంటున్నాడు నేచురల్ స్టార్ నాని. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్.విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి.కె.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నానీకి 30 సినిమా అవుతుంది.
‘సీతారామం’ సినిమాలో సీతామహాలక్ష్మిగా నటించిన మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోందని తెసింది. కాగా ఈ సినిమాకు కొత్తదర్శకుడి సారధ్యంలో ఉండబోతుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం నాని 29 వ చిత్రంగా దసరా సినిమాలో నటిస్తున్నారు.
ఇటు కండల వీరుడు సుధీర్ బాబు కొత్త సంవత్సరంలో “హంట్’’ చేయబోతున్నాదు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్నఈ “హంట్” చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహించారు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత. శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. “శక్తివంతమైన కథ, కథనాలతో రూపొంతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకి పనిచేసిన రెడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ నేతృత్వంలో తీర్చిదిద్దన యాక్షన్ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికే ట్రైలర్ విడుదల ట్రైలర్, పాపతో పైలం అనే పాటకు మంచిఆదరణ లభించింది.” అన్నారు.
మైమ్ గోపి,కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, చిత్ర శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్, ఛాయాగ్రహణం, అరుల్ విన్సెంట్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా అన్నేరవి బాధ్యతలు చేపట్టారు. కాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.