సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడం అనేది చాలా కష్టం అనే మాట వాస్తవం. నటుడు అయినా దర్శకుడు అయినా సరే కష్టపడాల్సిందే. నటుల సంగతి ఏమో గాని దర్శకుల విషయంలో మాత్రం చాలా కష్టం. కథ బాగుండాలి… సినిమా ఏ విధంగా తీస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలి… ఇలా ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇలా ఈ ఏడాది దర్శకులుగా అవకాశాలు కొట్టి సూపర్ హిట్ లు కొట్టారు కొందరు. వాళ్ళు ఎవరు అనేది చూద్దాం.
విద్యా సాగర్
అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాను డైరెక్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ మంచి హిట్ కొట్టారు. ఈ సినిమా టేకింగ్ చాలా బాగుంది.
విమల్ కృష్ణ
డీజే టిల్లు సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
వసిష్ఠ
బింబిసార సినిమా ఈ దర్శకుడికి మంచి హిట్ ఇచ్చింది. కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
శ్రీకార్తిక్
ఒకే ఒక జీవితం సినిమాతో ఏ సందడి లేకుండా సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేసాడు. ఇక్కడి నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.