సూపర్ స్టార్ మహేష్ బాబు… మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. అయితే చేసినవి తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు మహేష్.
నాలుగు పదుల వయస్సు మీద పడినప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించే మహేష్ కు అంత పెద్ద పిల్లలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ సినిమాలతోపాటు చాలావరకు యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు.
అలాగే విలువైన ఆస్తులు కూడా గడించాడు. మహేష్ బాబు ఆస్తుల్లో మొదటిగా ఏఎంబి సినిమాస్ గురించి మాట్లాడుకోవాలి. ఓ వైపు సినిమాలు చేస్తూనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు ఏ ఎం బి సినిమాస్ ను స్టార్ట్ చేశాడు. సుమారు 100 కోట్ల రూపాయలతో దీనిని స్టార్ట్ చేసాడు.
మరొకటి ప్రస్తుతం మహేష్ నివాసముంటున్న సొంత ఇల్లు. ఈ ఇల్లు ఏకంగా 50 కోట్ల రూపాయలతో నిర్మించారట. ఎంతో విలాసవంతంగా ఉండే ఈ ఇంట్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయట. మినీ డబ్బింగ్ స్టూడియో కూడా ఉందట. తన సినిమాలకు సంబంధించిన డబ్బింగ్ కూడా మహేష్ అక్కడి నుంచే చెప్పాడట.
ALSO READ : మగధీరను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయకుండా ఆపింది ఎవరో తెలుసా ?
వీటితో పాటు లగ్జరీ కార్లు కూడా మహేష్ బాబు దగ్గర ఉన్నాయి. 2 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ 730 మోడల్ తో పాటు చాలా కార్లు ఉన్నాయి. అలాగే కార్ వాన్… మహేష్ దగ్గర అత్యంత విలాసవంతమైన కార్ వాన్ కూడా ఉందట. దీని ఖరీదు ఆరున్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. టాలీవుడ్ హీరోలు ఎవరు దగ్గర లేని లగ్జరీ కార్ వాన్ మహేష్ బాబు దగ్గర ఉందట.
Advertisements
హృతిక్ రోషన్ కు ఎన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
ఆఖరిగా పద్మాలయ స్టూడియోస్ హైదరాబాద్ లో నాలుగు ఎకరాల లో ఈ స్టూడియో ఉంది. దీని ఖరీదు 350 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఇవి మహేష్ దగ్గర ఉన్న విలువైన ఆస్తులు.