మూడు రాజధానుల విషయంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ విఫలమైందన్న సంగతి చిరుకు తెలియదా అంటూ ప్రశ్నించారు. సినిమాల్లో కోట్లు సంపాదించే పవన్ ఎందుకు రైతులతో కలిసి రోడ్డు మీదకు వచ్చాడో తెలియదా అని ప్రశ్నించారు. పృథ్వీ కమెడియన్ అని ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవద్దని చెప్పారు. సేవ్ అమరావతి కోసం హీరోల మద్దతును కోరాల్సిన అవసరం లేదని వారి సినిమాలను చూడటం మానేస్తే వారే దిగొస్తారని వ్యాఖ్యానించారు. జగన్ వాళ్ళ నాన్న చేసిన పనుల్లో 10శాతం చేసిన గొప్ప సీఎం అవుతారని తెలిపారు.