బూతు ఆంధ్రా, గలీజ్ ఆంధ్రా అంటూ సినిమా తారల్లో ఇన్నాళ్లు లోలోపల ఉన్న ఆగ్రహం బయటకొచ్చింది. బ్లాక్ మెయిల్ వార్తలతో విషం చిమ్ముతున్నారంటూ తెలుగు హీరో విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన ఉద్యమానికి మహేష్ బాబు, రానాతో పాటు సినీ దర్శకులు మద్దతు పలుకుతున్నారు.
తాజాగా ఈ అంశంపై తెలుగు సినీ నిర్మాతల మండలి స్పందించింది. ఇలాంటి బేస్ లెస్ వార్తలు రాసినందుకు అమెరికా నుండి తరిమేశారని, అయినా బుద్ధి మారలేదని మండిపడింది. సినీ తారలపై కల్పిత వార్తలు రాస్తూ, పర్సనల్ విషయాలంటూ ఊహాజనిత వార్తలతో వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
సినిమాలకు రేటింగ్స్ రాయటానికి భారీ మొత్తాన్ని డిమాండ్ చేయటం, సినిమా ఆర్టిస్టులకు పాజిటివ్ వార్తలు రాసేందుకు డబ్బులు అడిగే అలవాటు గ్రేట్ ఆంధ్రాకు ఉందంటూ నిర్మాతల మండలి ఆరోపించింది. తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.