తెలంగాణలో విద్యాసంస్థలన్నింటిని మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమంలో ఆందోళన మొదలైంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రభుత్వం థియేటర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా ఏడాదిపాటు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న సినీ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జనవరి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వడంతో తిరిగి గాడినపడింది. కానీ కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుండటంతో మూవీమేకర్స్ బిక్కుబిక్కుమంటున్నారు.
కరోనా వైరస్ మళ్లీ తిరగబెడుతున్న దృష్ట్యా… తెలంగాణలో థియేటర్లు, పార్కులు, జిమ్‌లను మూసివేయాలని రాష్ట్రవైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తోంది. మూసివేయడం సాధ్యం కాకపోతే.. 50 శాతం సీటింగ్‌తో నిర్వహించేలా చూడాలని కోరినట్టుగా సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో టాలీవుడ్‌లో టెన్షన్ నెలకొంది.